15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

– 30 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 30 మందిపై కూడా కేసులు నమోదు చేసుకొని 30 మందికి సోమవారం నగరంలోని జిల్లా టిటిఐ కౌన్సిలింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా ఫోన్లో క్షుణ్ణంగా చూపిస్తూ వివరించారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిసినప్పటికీ వాహనదారులు మాత్రం మారడం లేదు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు వరకే చూడడం జరుగుతుంది లేదంటే ఎఫ్ ఐ ఆర్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని మద్యం ప్రియులను హెచ్చరించారు.వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారుల లో కోరారు. ఒకవేళ నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ లతోపాటు మద్యం సేవించిన వారు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Spread the love