ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం

నవతెలంగాణ – రామారెడ్డి
ప్రతిభ చూపిన మునురుకాపు విద్యార్థులకు, రామారెడ్డి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో, మండలంలోని రెడ్డి పేటలో శాలువాతో సన్మానించి, జ్ఞాపికను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… విద్యార్థి దశ చాలా కీలకమైనదని, కష్టపడి చదివి, ఉన్నత శిఖరాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, ప్రాంతానికి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షులు బండి ప్రవీణ్, గౌరవ అధ్యక్షులు తోట భూమయ్య, ప్రచార కార్యదర్శి బండి ప్రవీణ్, కాల శ్రీనివాస్, గోపు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love