పోరాట ఫలితమే వికలాంగులకు పింఛన్ పెంపు

నవతెలంగాణ -నవీపేట్: మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంచిందని జాతీయ విహెచ్ పి ఎస్ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి అన్నారు. మండల కేంద్రంలో వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి శనివారం శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుజాత సూర్యవంశి మాట్లాడుతూ విహెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితంగానే కెసిఆర్ ప్రభుత్వం వికలాంగులకు వేయి రూపాయలు పెంచిందని అన్నారు. 30 డిమాండ్లతో కూడిన ఉద్యమాన్ని నిర్వహిస్తే కేవలం ఒక్క డిమాండ్ వెయ్యి రూపాయలు ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఇంకా 6000 రూపాయల పెంచే వరకు, వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ మరియు వికలాంగ బంధు ఇలాంటి డిమాండ్లతో ఈ నెల 13వ తేదీ నుండి మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.బోధన్ ఎమ్మెల్యే షకిల్ ఆమీర్ వికలాంగులు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచినందుకు కోస్లి గ్రామంలో సన్మానం చేయాలని ప్రయత్నించిన పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మానికోళ్ల గంగాధర్, ఆకారం రమేష్ , గంగాధర్ పంతులు, పోశెట్టి, సంజీవ్, భయ్యా సతీష్ ,యాదగిరి, రాజేందర్, గంగామణి, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love