19న జరిగే రాష్ట్ర జిప్ జాత జయప్రదం చేయండి సిఐటియు పిలుపు

నవతెలంగాణ – కంటేశ్వర్
అంగన్వాడి సమస్యల పరిష్కారం కొరకు 19న జరిగే రాష్ట్ర జీప్ జాతాను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారము సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జిల్లా కోశాధికారి పి చంద్రకళ గౌరవాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడి ఉద్యోగులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా గ్రాట్యూటీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర జాత జరుగుతుందని. ఆదిలాబాద్ లో ప్రారంభమయ్యే జాత ఈనెల 19న నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుందని 19న ఉదయం ఆర్మూర్ పట్టణంలో మధ్యాహ్నం నిజాంబాద్ నగరంలో జాత నాయకులకు స్వాగతం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ జాతను జయప్రదం చేయటానికి అంగన్వాడీ ఉద్యోగులందరూ కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు అనంతరం జీప్ జాతకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మంగాదేవి, శివరాజమ్మ, వాణి, సూర్య కళ, అరుణ, సరిత, జ్యోతి, లావణ్య, విజయ, భాగ్య తదితరులతో పాటు వివిధ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love