తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరులకు జోహార్లు

నవతెలంగాణ-గోవిందరావుపేట

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో ఆశువులు బాసిన అమర్ ల కు జోహార్లు జోహార్లు అంటూ పిఏసి ఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘంలో  తెలంగాణ రాష్ట్ర పదవ ఏర్పాటు  సందర్భంగా జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఫార్మేషన్ డే జరుపుకోవడం అందరం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సహితం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో ఆశువులు భాషారని వారందరికీ మనం ఈ రోజున పేరుపేరునా జోహార్లు పలుకుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్లు సభ్యులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Spread the love