వాహన తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

నవతెలంగాణ-కరీంనగర్ క్రైమ్ : పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ వెలువడినందున అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టవర్ సర్కిల్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన అలగం కుమారస్వామి వద్ద నుండి సరైన ఆధారాలులేని (88,000/-) ఎనభై ఎనిమిది వేల రూపాయలను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సరిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన డబ్బును తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని తెలిపారు.
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలు లేని (18,75,651/-)పద్దెనిమిది లక్షల డెబ్భై ఐదు వేల ఆరు వందల యాబై ఒక్క రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్ నుండి సరైన ఆధారాలులేని 6,00,000/- ఆరు లక్షల రూపాయలను,మానకొండూర్ మండలం ఊటూరు గ్రామానికి చెందిన పడాల హరీష్ నుండి 12,75,651 పన్నెండులక్షల డెబ్భైఐదువేల ఆరువందల యాభై ఒక్క రూపాయలను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన డబ్బును తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని తెలిపారు.

Spread the love