నవతెలంగాణ – నసురుల్లాబాద్ (బాన్సువాడ)
నిరుపేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని, తొమ్మిది ఎండ్లాల్లో సాగిన పాలన విభాగంలో ఏర్పడిన ప్రజా సౌకర్యములతో కూడినదే ఈ సంక్షేమ సంబరాలని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాససభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా లోని శ్రీ వెంకట సాయి స్కూల్ లో నసురుల్లాబాద్ మండల మరిది గ్రామాల సంక్షేమ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లో ముఖ్య అతిథిగా విచ్చేసారు. నసురుల్లాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వేల సంఖ్య లబ్దిదారులు రావడంతో స్కూల్ ప్రాంగణం నిండిపోయింది. ముందుగా స్పీకర్ అమరవీరులకు నివాళ్ళు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల పైన అధికారులు ఆసరా పింఛన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు వివారిస్తుండగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగాని గురై ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనితో సభలో ఉన్న మహిళలు కన్నీరుమున్నీరైయ్యారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. నసురుల్లాబాద్ మండలం 17 గ్రామ పంచాయతీల్లో 19వేల ఐదు వందల మంది ఉండగా సంక్షేమ లబ్దిదారులు 18679 మంది ఉన్నారని, మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో ఒక్కటి నుంచి మూడు, నాలుగు సంక్షేమ పథకాలు చేరాయని తెలిపారు. డబుల్ బెడు రూముల నిర్మాణ దారులకు డబ్బులు రాక పోవడంతో ప్రజలు ఇబ్బందులు చూడలేక ఒక దశలో నా స్వంత ఇల్లు అమ్మి వారికి ఆదుకోవాలని అనుకున్న అదే సమయంలో నిధులు విడుదల కావడంతో ఊపిరి పీల్చుకున్న. నిత్యం 15 గంటల పాటు ప్రజల కోసమే పని చేస్తాన్నారు. ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ఆదర్శం అన్నారు. రాష్ట్రంలోని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, బతుకమ్మ పండుగలకు మహిళలకు చీరెలు, ముస్లింలకు రంజాన్ కానులు, క్రైస్తవులకు గిఫ్ట్‌ప్యాక్ అందజేసి వారి ఇళ్లలో ఆనందం నింపుతున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో విద్య, ఉద్యోగ రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మత పిచ్చి ఉన్న నాయకుల మాటలను నమ్మొద్దని, గ్రామాల్లోకి వస్తున్న ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌పై చెడుగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుల్లా పని చేయాలన్నారు. ఇంత పెద్ద బహిరంగ సభకు స్వచ్చందంగా లబ్దిదారులు రాకకు కృషి చేసిన పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపిపీ పాల్త్య విఠల్ కు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాపేదర్ శోభరాణి, ఆర్డీఓ రాజగౌడ్, ఎంపిపి పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పిటిసి జన్నుబయి ప్రతాప్ సింగ్, జడ్పి కో అప్షన్ మెంబర్ మజీద్, అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, మండల కో అప్షన్ మెంబర్ ముస్తఫా ఉషేన్, నాయకులు అధికారులు తదితరులు హాజరయ్యారు.