వేతనాలు చెల్లించండి మహాప్రభో..

– వీసిని అడుగడుగునా అడ్డుకున్న ఔట్సోర్సింగ్, విద్యార్థులు
– పవర్ లేని వీసి రాజీనామా చేయాలి
– మూడు రోజులుగా పస్తులు ఉంటున్నాం.. విద్యార్థులు
– ఈసీ సమావేశం కు హాజరుకాని సభ్యులు
– వీసీ కాళ్ళు మొక్కిన దినసారి సిబ్బంది
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ప్రతినెల ఒకటో తేదీన వచ్చే వేతనాలు నేటి వరకు రాకపోవడంతో ఆగ్రహించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది గత మూడు రోజుల నుండి యూనివర్సిటీలో పనులను బంద్ చేసి దీపాలన భవనం వద్ద బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు బుధవారం ఈసీ పాలకమండలి సమావేశం ఉందని మంగళవారం రాత్రి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పాలకమండలి సభ్యులకు సమాచారం అందజేశారు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుందని తెలుసుకున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది విద్యార్థులు వందల సంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు అంతలోనే వైస్ ఛాన్సలర్ రావడంతో పరిపాలన భవనంలోకి వెళ్లకుండా అడగడుగునా అడ్డుకుంటూ తీసి ముందే బైఠాయించి వీసీ కు హటావో యూనివర్సిటీ కు బచావో.. వైస్ ఛాన్స్లర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పవర్ లేని వీసి ఎందుకని విద్యార్థులు ఔట్సోర్సింగ్ సిబ్బంది నినాదాలతో పరిపాలన భవనం మారు మోగింది. ఎంత నచ్చజెప్పుతున్న ఎవరు అనడంతో సమస్యకు పరిష్కారం దొరికే వరకు తమతోపాటే ఎండలో వైస్ ఛాన్స్లర్ కూర్చుండాలని వారు పట్టుపట్టారు. అనంతరం లోపలి నుండి ఒక కుర్చీని తెప్పించి విద్యార్థుల మధ్యలోనే కూర్చుండబెట్టుకుని వైస్ ఛాన్సలర్ ఎదుటే పేద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ను రప్పించి వేతనాల సంగతి తీర్చాలని డిమాండ్ చేశారు కొద్దిసేపటికి బ్యాంక్ మేనేజర్ వచ్చి తన చేసేది ఏమీ లేదని హైకోర్టులో కేసు ఉండడంతో చెక్కు క్లియరెన్స్ కావడం కష్టమన్నారు. రిజిస్టర్లు తెలంగాణ యూనివర్సిటీ క ఇద్దరు ఉండడంతో డబ్బుల విషయంపై ఏమి చేయలేవని వైస్ ఛాన్సలర్ నియమించిన రిజిస్టర్ కనకయ్య ఉంటే ఈసీ సభ్యుల అనుమతి తప్పనిసరిగా కావాలని లేక ఇంతకుముందు ఉన్న రిజిస్టర్ యాదగిరి ఉంటే వైస్ ఛాన్సలర్ సంతకం పెట్టిన చెక్కు క్లియరెన్స్ అయి వేతనాలు వస్తాయని బ్యాంకు మెనెజర్ తేల్చి చెప్పారు.
దాదాపు 4నుండి5 గంటల పైబడి లోనికి వెళ్లకుండా వైస్ ఛాన్స్లర్ను అడ్డుకున్నారు. వీసీ కు పవర్ ఉంటే యూనివర్సిటీలో పనిచేసే అధికారులను బయటికి రప్పించి అందరి సమక్షంలోనే సంతకం చేసి సమస్యను తీర్చిన తర్వాతనే లోనికి వెళ్లాలని స్పష్టమైన హామీ ఇవ్వనిదే వదిలిపెట్టబోమని తేజ్ చెప్పారు. చంబార్లో కూర్చుండి వేతనాల సమస్యను పరిష్కరిస్తారని చెప్పడంతో విద్యార్థులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వీసి వెన్నంటే చాంబర్ కు వెళ్లారు. వీసీ ఛాంబర్ కు తాళం ఉండడంతో చేసేదేమీ లేక కోరుతోంది సేపు అక్కడే క్యాబిన్ లో కుర్చుని తిరిగి బ్యాంక్ వద్దకు వచ్చి మెనెజర్ తో మాట్లాడారు. నిజామాబాద్ నుండి ఎస్బిఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ యూనివర్సిటీ కి వచ్చారు. చీఫ్ మేనేజర్ కూడా ఇదే విషయాన్ని వీసీ రవీందర్, రిజిస్ట్రార్ కనకయ్య లకు తేల్చి చెప్పారు. ఈసీ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారని తమకు కోర్టు నుండి ఎలాంటి లావాదేవీలు జరుపవద్దని ఆదేశించారని కోర్టు ఆదేశాలను తాము కచ్చితంగా పాటిస్తామని బ్యాంకు మెనెజర్ తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక వీసీ, రిజిస్ట్రార్ మిన్నకుండి పోయారు. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు యూనివర్సిటీ నుండి ఎలాంటి లావాదేవీలైన వైస్ ఛాన్స్లర్ రిజిస్టర్లే సంతకాలు పెట్టి పంపడం జరిగేదని వెంటనే అది క్లియరెన్స్ అయి సమయానుసారం వేతనాలు వచ్చేవని కావాలని బ్యాంక్ మేనేజర్ రాద్ధాంతం చేస్తున్నారని విద్యార్థులు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎలాంటి ఆలోచనలు లేకుండానే ఆందోళనలు చేయడం సరికాదని, వేతనాల కోసమే ఈసీ సమావేశం పెట్టాలని వైస్ ఛాన్స్లర్ నిర్ణయించినట్లు రిజిస్టర్ కనకయ్య తెలిపారు. వైస్ ఛాన్స్లర్ కి సర్వాధికారాలు ఉంటాయని ఈసీ సభ్యులకు నియమించే అధికారం ఉండదని తన వద్ద నియామకం పొందిన ఆర్డర్ కాపీ ఉందని రిజిస్టర్ కనకయ్య బ్యాంక్ మేనేజర్ కు వివరించారు. అనంతరం రిజిస్టర్ కనకయ్య నవతెలంగాణ త మాట్లాడుతూ ఈనెల మూడున మూడు కోట్ల 25 లక్షల రూపాయల చెక్కును బ్యాంకులో జమ చేయడం జరిగిందని ఇవన్నీ తెలంగాణ యూనివర్సిటీలో విధులు నిర్వహించే టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాధకని దాదాపు యూనివర్సిటీ పరిధిలో నాలుగు వందల పైచీలకు మంది వేతనాలకు సంబంధించిందని క్లియరెన్స్ వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆజ్యం పోస్తున్నారని పేర్కొన్నారు. పనిచేయని వారికి వేతనాలు ఇవ్వమని తేల్చి చెప్పడంతో కొందరు ఉద్యోగులు యూనివర్సిటీ దాటి ఎలా వెళ్తారో చూస్తామని బ్లాక్మెయిల్ చేయడం సభవు కాదన్నారు.
ఆగని విద్యార్థులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నినాదాలు..
ఉదయం నుండి సాయంత్రం వరకు వైస్ ఛాన్సలర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గత మూడు రోజులుగా వసతి గృహాల్లో వంటలు చేయక పస్తులు ఉంటున్నామని తాగడానికి నీళ్లు సైతం దొరకని పరిస్థితి దాపురించిందని ముందుగా వీర సమస్యలు పరిష్కారమైతేనే వారు
భోజనాలు తయారు చేస్తారని, యూనివర్సిటీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టడంతో త్రాగునీటికి సైతం కోరత ఏర్పడిందని విద్యార్థులు వీసీ పై కోపోద్రిక్తు డైయ్యరు.
ఈసీ సమావేశం హుష్..
వైస్ ఛాన్స్లర్ రవీందర్ తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం యూనివర్సిటీలో బుధవారం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులు హాజరుకావాలని మంగళవారం రాత్రి 7 గంటలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందజేశారు. అసలు పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న ఏడ్రోజుల ముందుగా పాలకమండలి సభ్యులు సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అలా కాకుండా హడావిడిగా రాత్రి సమయంలో వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపడంతో జరగవలసి ఉన్న పాలకమండలి సమావేశం ఒక్క పాలక మండలి సభ్యుడు రాకుండనే సమావేశం జరగలేదు.అంతకు ముందు వైస్ ఛాన్సలర్ పాలకమండలి సభ్యులకు ఫోన్ చేయాలని రిజిస్ట్రార్ కనకయ్య కు సూచించారు.దినిలో యునివర్సిటీ లో ఉన్న ముగ్గురు సభ్యులలో ప్రిన్సిపాల్ ఆరతి సెలవుపై ఉన్నానని,ప్రోఫెసర్ నసీం,రవిందర్ రెడ్డి లు యూనివర్సిటీ లో ఉన్న వైస్ ఛాన్సలర్ మాట్లాడిన ఎ ఒక్క సభ్యుడు సమావేశం కు రాలేకపోయారు.ఇదే విషయంపై రిజిస్ట్రార్ కనకయ్య మాట్లాడుతూ కోందరు పాలక మండలి సభ్యులు యూనివర్సిటీ పరిపాలన భవనం వద్దకు వచ్చిన అవుట్సోర్సింగ్, విద్యార్థుల ఆందోళనలు చుసి వేళ్ళని పోయారని చెప్పడం కోసమెరుపు..
వైస్ ఛాన్సలర్ కళ్ళు మొక్కిన సౌత్ క్యాంపస్ దినసారి సిబ్బంది..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బిక్నూర్ సౌత్ క్యాంపస్ లో పనిచేస్తున్న సిబ్బంది 15 మంది తెలంగాణ యూనివర్సిటీ కి చేరుకొని వైస్ ఛాన్స్లర్ రవీందర్ కాళ్లు మొక్కి తమ పరిస్థితి ఏంటని వెడుకున్నరు. తమ వద్ద నుండి వసూలు చేసిన 50 నుండి 1,50,000 వరకు ఒక్కొక్కరి వద్ద నుండి తీసుకున్న డబ్బులను, గత మూడు నెలల నుండి చేసిన పనికి గాను వేతనాలు సైతం చెల్లిస్తానని హామీ ఇచ్చిన దినసారీ సిబ్బంది ససే మీరా అని,మీ మాట నమ్ముకొని తామంతా రోడ్డున పడ్డామని, తమకు మీపై నమ్మకం లేదని వీసీ కు తెలిపారు.మీరు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోనే మీ వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చివేస్తానని వీసీ దినసారీ సిబ్బందికి హామీ ఇవ్వడంతో 15 మంది దినసారి సిబ్బంది తిరిగి వెళ్ళిపోయారు.
పూల కుండీలను ధ్వంసం చేసిన విద్యార్థులు..
యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పలుకూరితో కలిసి తన సంబరపు వెళ్తున్నప్పుడు అయినా కొందరు విద్యార్థులు మెట్లపై ఉన్న పూల కుండిలను ధ్వంసం చేశారు. తమ గత మూడు రోజులవుగా భోజనాలు చేయకపోవడంతో ఆగ్రహం తో విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకు పరిపాలన భవనం వద్దే ఉండిపోయారు. ఎండ తీవ్రంగా ఉండడంతో బయట నుండి తాగు నువ్వు తప్పించుకున్నారు ఉదయం టిఫిన్ సైతం పరిపాలన భవనం వద్దే చేశారు.

Spread the love