కేటీఆర్ పర్యటన ను జయప్రదం చేద్దాం..

– సూరపనేనీ సాయికుమార్ బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగులో బుధవారం జరిగే మంత్రి కేటీఆర్ పర్యటనను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ నందు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తల సమావేశం జరిగింది, ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ బుధవారం ములుగు జిల్లాలో కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందర్భంగా గోవిందరావుపేట బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ ఎత్తున తరలి వెళ్లడానికి ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు భారీగా కార్యకర్తలను సమీకరించి పర్యటనలు విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్ర ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ములుగు జిల్లాకు వస్తున్న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తుమ్మల హరిబాబు మండల ప్రధాన కార్యదర్శి నరసింహ కో ఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్ తో పాటు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీల అధ్యక్షులు గ్రామ కమిటీల సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love