
జీఓ317 స్థానికత కోల్పోయిన వారికీ న్యాయం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ తిరిగి స్థానిక జిల్లాలకు కేటాయించవలసిందిగా మంత్రి సబిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందించామన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ.ఓ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు. రాష్ట్ర కోశాధికారి వినోదారాణి, జస్సీ రాణి, సంఘ నాయకులు లక్ష్మీనారాయణ రత్నమాల, సత్యనారాయణ,దూడ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.