అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

నవతెలంగాణ- రామారెడ్డి
అప్పుల బాధతో మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన మాసన్న గారి కలవ్వ( 48) ఇద్దరి కుమారుల పెళ్లి ఒకే సంవత్సరం నిర్వహించడం, భర్త అనారోగ్యంతో ఆసుపత్రి ఖర్చులు, డ్వాక్రా గ్రూపులో లోన్ బాకీలతో ఇబ్బంది పడుతూ, ఇంట్లో దూలానికి చీర కొంగుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పెద్ద కుమారుడు పెద్ద లింబాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Spread the love