బస్సు నడపండి గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఆధ్వర్యంలో మేనేజర్ కు వినతి

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామానికి బాన్సువాడ డిపో నుండి బస్సును నడపాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఆధ్వర్యంలో బాన్సువాడ డిపో మేనేజర్ కు మంగళవారం నాడు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు డిపో మేనేజర్ కు విన్నవిస్తూ మాదనిపర్గా గ్రామానికి వయ డోంగ్లి మీదుగా మోగా మేనూర్ మద్నూర్ నుండి దెగ్లూరు కు బస్సును నడపాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు బస్సు వేళలు కూడా చూపించారు. ఉదయం ఎనిమిది గంటలకు మాదన్ ఇప్పర్గా గ్రామానికి బస్సు వచ్చే విధంగా చూడాలని మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆ తర్వాత తిరుగు ప్రయాణం సాయంత్రం నడిచే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్తులంతా కోరారు.. బస్సు సౌకర్యాన్ని ఈనెల 15 నుండి ప్రారంభించాలని వినపత్రంలో పేర్కొన్నారు.

 

Spread the love