పర్యావరణాన్ని దెబ్బతీసెలా ఫ్లేక్సీలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు

– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
నవతెలంగాణ – సిద్దిపేట
పర్యావరణాన్ని దెబ్బతీసేలా సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, దీనిపై మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటిఅర్ ఏం సమాధానం చెప్తారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే మున్సిపల్ అధికారులు తొలగించాలని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సంపత్ కు సిద్దిపేట లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కెటిఅర్ మంత్రి ఏం ఘనకార్యం సాధించారాని సిద్ధిపేటకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలను లీకులు చేసి విద్యార్థుల జీవితాలు ఆగం చేసేలా కేటీఆర్, ఈ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని , ఉద్యోగాల ప్రకటన తో యువతను ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ను ఏలాగైనా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు మజర్ మాలిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధు , యు వజన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ , ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రషద్, మైనార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఫయాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love