రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచండి: ఏపీ హైకోర్టు

నవతెలంగాణ – అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను భద్రపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని కోరారు. రెండేళ్లు పూర్తి కావడంతో ఈ నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్టు రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కౌంటరు దాఖలు చేశారు. కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ వైద్యుల నివేదికల వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Spread the love