యూనివర్సిటీలో 2నెలలుగా వివాదాల

– పరిష్కారానికి ప్రభుత్వం పునుకొక పోవడం దుర్మార్గం…
–  ఎస్ ఎఫ్ ఐ -పి డి ఎస్ యూ అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో గత 2 నెలలుగా వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం పునుకొక పోవడం దుర్మార్గమని, ఇప్పటికైన జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ ఎఫ్ ఐ -పి డి ఎస్ యూ అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను రోడ్డున పడేసి, యూనివర్సిటీని వివాదాలకు కేంద్రంగా వైస్ ఛాన్సలర్, తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి మార్చకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొక పోవడం శోచనీయమని పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్, ఎస్ ఎఫ్ ఐ యునివర్సిటీ అద్యక్షులు లావిశేట్టి ప్రసాద్ లు అన్నారు. తెలంగాణ యునివర్సిటీ కేంద్రంగా ఆదిపత్యం కోసం జరిగే వివాదాలను ప్రభుత్వం జోక్యం చేసుకొని,తక్షణమే చర్యలకు పూనుకోవాలని వారన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్ని నెలల నుండి జరుగుతున్న వివాదాల కారణంగా పరిపాలన పూర్తి స్థాయిలో స్తంభించిపో యిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని, యూనివర్సిటీ లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన నిస్పక్షావతంగా నిజాయితీగా పనిచేసే వారినే యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా నియమించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి 2023 మే 31 వరకు తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు, పదోన్నతులు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేవలం ఆధిపత్యం కోసం అక్రమ సంపాదన కోసం రిజిస్ట్రార్ పోస్టును అమ్ముకోవాడానికి సిద్ధం అవడం దుర్మార్గమన్నారు.  యూనివర్సిటీలో అన్ని అక్రమ నియామకాలు, పదోన్నతులను రద్దు చేయాలన్నారు. అక్రమంగా జరిగిన ఆర్థిక లావాదేవీలను రద్దుచేసి, నిధులను రికవరీ చేయాలన్నారు. వీసీ, ఈసీలు పరస్పరం ఆరోపణలు చేసుకుని యునివర్సిటీ పేరును బద్నాం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు.వీసీ, ఈసీలు పరస్పరం చేసుకున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి చర్యలకు ఉపక్రమించాలన్నారు. అక్రమాలకు, ఫైరవీలకు చెక్ పెట్టి తెలంగాణ యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అతి త్వరలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని, అక్రమ నియామకాలపై కఠిన చర్యలు తీసుకొని, యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణాన్ని పెంపొందించని పక్షంలో పిడిఎస్ యూ -ఎస్ఎఫ్ఐ విద్యార్థీ సంఘాలుగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్, కర్క గణేష్, జిల్లా నాయకులు ఎస్కే అషూర్, అనిల్, నిఖిల్, వినోద్,వంశీ, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love