నవతెలంగాణ – ఆర్మూర్
బీసీ కులాల్లో చేతివృత్తుల మీద ఆధారపడి జీవించే పేద వారికి చేయుత నివ్వాలన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టణంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో నియోజక వర్గంలోని అయిదుగురు లబ్ది దారులకు ఒక లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలను అందిపుచ్చుకుని బీసీలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాలని జీవన్ రెడ్డి సూచించారు.
నూతన దంపతులను ఆశీర్వదించిన జీవన్ రెడ్డి..
పట్టణ బీఆర్ఎస్ నాయకుడు తెడ్డు చిన్న రాజన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో డాల్ఫిన్ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆకుల లలిత గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి నిజామాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లలిత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ..జాగృతి యువనేత రమేష్ ను ఆశీర్వదించిన కవిత, జీవన్ రెడ్డి మాక్లూర్ మండలం ఆమ్రద్ తండాలో జాగృతి యువ నాయకుదు మలవత్ రమేష్ వివాహం శనివారం జరగనున్న సందర్భంగా ఒక రోజు ముందే ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తాలు కలిసి వెళ్లి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.