ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

నవతెలంగాణ – వైరా: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని కల్లూరు మండలం లాక్యాతండాకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. కారును లారీ ఢీ కొన్న తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Spread the love