ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డుపమ్రాదం..ముగ్గు‌రు మృతి

road accidentనవతెలంగాణ – ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

Spread the love