డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 37 వ వర్ధంతి

నవతెలంగాణ -గోవిందరావుపేట
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 37వ వర్ధంతిని గురువారం మండలంలోని పసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ సీనియర్ నేత మడిపల్లి శ్యాంబాబు  ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు  జయంతి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  చతిస్గడ్ రాష్ట్ర ఇంచార్జి మహాజన సోషలిస్ట్ పార్టీ  ములుగు జిల్లా ఇన్చార్జి  దళితరత్న అవార్డు గ్రహీత ఇరుగు పైడి మాదిగ హాజరై డాక్టర్ బాబు జగ్జీవన్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు.భారత రాజకీయాల్లో ఓటమి  ఎరుగని ధీరుడు, పరిపాలన దక్షకుడు, భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అన్నీ హక్కులను రూపొందిచిన రైటర్ అంబేద్కర్ గారైతే, ఆహక్కులు చట్టరూపం దాల్చేలా పోరాడిన ఫైటర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.భారత రాజకీయాల్లో బాబు జగ్జీవన్ రాం పాత్ర అమోఘమైనదని,ఓటమి ఎరుగని ధీరునిగా ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం రాజకీయ జీవితంలో ఉన్న ఏకైక చరిత్ర బాబుజీదే అని,స్వతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ రచన కమిటీ సభ్యునిగా, భారత మాజీ ఉప ప్రధానిగా దేశ పునర్నిర్మాణం కోసం, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించిన ఆమహానీయుడికి పాలకుల కుల వివక్షత వల్ల భారత రత్నకు నోచుకోలేకపోయారని, భారత ప్రభుత్వం స్పందించి దేశానికి అట్టడుగు వర్గాల ప్రజలకు ఆరు దశాబ్దాలు సేవ చేసిన బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ప్రకటించాలని అన్నారు .అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా, మంత్రిగా, 50 ఏండ్లు గొప్ప పార్లమెంటేరియన్ గా, 30 ఏండ్లు కేంద్ర మంత్రిగా, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు నిర్వర్తిస్తూ హరిత విప్లవ సృష్టికర్త, యుద్ధ రంగ వ్యూహకర్త, కార్మిక సంక్షేమ చట్టాల రూపకర్త, సామాజిక సంస్కరణ ఉద్యమాల ముందడుగు, సమతావాది, సంఘ సంస్కర్త, బాబాసాహెబ్ సమకాలీకుడు,దళిత, పీడిత వర్గాలకు మార్గదర్శుడుగా నిలిచారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్  సేవలు చిరస్మరణీయం, కార్మిక శాఖ మంత్రిగా,వ్యవసాయ శాఖ మంత్రి గా, కమ్యూనికేషన్, తపాల, రైల్వే,రక్షణ శాఖ మంత్రిగా చేసిన కృషి, బడుగుల హక్కుల కోసం చట్టసభల్లో పోరాడిన విధానం, త ద్వారా పొందిన మేలు మరచిపోలేనిదని, స్వతంత్ర సమరయోధుడిగా, రాజ్యాంగ రచన కమిటీ సభ్యునిగా దేశ పునర్నిర్మాణం కోసం, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని,  కొనియాడారు. రాజకీయ దురంధరుడు, గొప్ప పరిపాలన దక్షకుడు, దళిత జనోద్దారకుడు, సంఘ సంస్కర్త, చట్టసభల్లో పీడత వర్గాల గొంతుకగా కొట్లాడిన హక్కుల ఫైటర్ అని అన్నారు. వారి ఆశయాల సాధన కోసం మహనీయుల కలలుగన్న మహాజన రాజస్థాపన కోసం మందకృష్ణ నాయకత్వంలో ఉద్యమిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల నాయకులు గడ్డం సారయ్య ,తిక్క దుర్గారావు,ఎనగందుల మొగిలి, తోకల రాంబాబు, పసుల  భద్రయ్, నీలాల మల్లేష్, మునిగాల సాంబయ్య, వేల్పుల కృష్ణ, ఆతుకూరి నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love