బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి: సర్పంచ్

నవతెలంగాణ – గోవిందరావుపేట
తల్లిదండ్రులు మరియు స్థానికులు బడిగిడు పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని గోవిందరావుపేట సర్పంచ్ లావుడియా లక్ష్మి అన్నారు.
బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కే రఘురాం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ లక్ష్మి హాజరై మాట్లాడారు. పిల్లలను బడిలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. అనంతరం మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేయించాలని అన్నారు. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్న మేరి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వై. కన్నయ్య, కే. రమేష్ బి. సూర్య, ఎస్.రాజు ఎం ఆర్ సి .సిబ్బంది బి .విష్ణు, సిఆర్పి రజిత మరియు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Spread the love