విద్యతోపాటు క్రీడాకారులను అందించిన ఘనత హనుమాన్ వ్యాయంశాల కు ఉంది

– మాజీ ఎంపీ అధ్యక్షులు వి హనుమంతరావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
విద్యతో పాటు క్రీడాకారులను అందించిన ఘనత హనుమాన్ వ్యాయామశాల కు ఉందని మాజీ ఎంపీ హనుమాన్ వ్యాయంశాల అధ్యక్షులు వి హనుమంతరావు అన్నారు. శుక్రవారం సుల్తాన్ బజార్ లోని హెచ్ వి ఎస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాగడ జ్యోతిని వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ వ్యాయామశాల విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అందించిన ఘనత హనుమాన్ వ్యాయామశాల కు ఉందన్నారు. ఒలంపిక్ రన్ హనుమాన్ టెక్ని. అబిడ్స్ మీదుగా ఎల్బీ స్టేడియం చేరుకుంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ వ్యాయామశాల కార్యదర్శి మైథిలి శరన్. లక్ష్మణ్. కిషన్. సతీష్. విశాల్. మలేష్ యాదవ్ .జైరాజ్ యాదవ్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love