కస్తూర్బా పాఠశాలను సందర్శించిన డీఇఓ

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని కస్తూర్బా గాందీ బాలికల విద్యాలయం ను జిల్లా విద్యాశాఖ అధికారి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్ఎస్సి పరీక్షల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేకంగా శ్రద్ధగా చదవాలని, ఏ రోజు పాఠాలు అదేరోజు చదువుకోవాలని, అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులచే నివృత్తి చేసుకోవాలని, సూచించారు. ఇప్పటినుంచి కష్టంగా ఉన్న సబ్జెక్టు ఎక్కువ గంటలు చదవాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్ష కోసం ఈరోజు నుంచే ప్రత్యేక ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేయాలని సూచించారు. లాంగ్ ఆబ్సెంట్ విద్యార్థినిలు ఎవరూ లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థినిల హాజరు పట్టికలను, సరుకుల రిజిస్టార్లను, తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని ప్రగతి, ఉపాధ్యాయులు సవిత, బ్రిజారాణి, ఝాన్సీరాణి, మమత, జోష్ణ, శోభ, కవిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love