దగాపడ్డ తెలంగాణ లో మార్పు కోసం – మహా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – డిచ్ పల్లి
దగాపడ్డ తెలంగాణలో మార్పు కోసం – మహా ఉద్యమం పోస్టర్ను స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ జీవన్ శుక్రవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విద్యార్థి, నిరుద్యోగ ప్రజా వ్యతిరేఖ పాలన పై వివరించారు. తెలంగాణ లో విద్యారంగం తో పాటు అన్ని రంగాలలో మార్పు కోసం మహా ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. నయా నిజాం పాలననకు చరమ గీతం పడాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజులలో విద్యార్థులు పోషించవలసిన పాత్రను ప్రతి విద్యార్థికి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, జిల్లా ఎస్ఎఫ్ డి కన్వీనర్ ప్రమోద్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, నాయకులు సింహాద్రి, నాగరాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love