తూతూమంత్రంగా సర్వసభ్య సమావేశం..

నవతెలంగాణ  – డిచ్ పల్లి
మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా జరిగింది.శుక్రవారం డిచ్ పల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి గద్దె భూమన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని 34 గ్రామాలకు చెందిన ఒక్క సర్పంచ్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. ఎంపిటిసి లో ఏడుగురు హాజరు కావడంతో సభా కు అవసరం అయ్యే కోరం ఉందని సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి అంతా శాఖలకు చెందిన నివేదికను ఆ శాఖలకు చెందిన అధికారులు సభ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్కో సిబ్బంది డబ్బులు ఇవ్వనిదే పనిచేయడం లేదని సాంపల్లి ఎంపిటిసి బిక్యనాయక్ సభా దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం సంబంధిత శాఖ ఏఈ సమాధానం ఇస్తూ అలాంటిది ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నేలా ఏ సరుకు ఎంత వస్తుందో ఎంత మిగులుతుందో ప్రజా ప్రతినిధులైన సర్పంచ్లకు, ఎంపిటిసి లకు తెలపడం లేదని అమృతపూర్ ఎంపిటిసి సాయిలు పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశం ఉందని తెలిసిన అయా శాఖలకు చెందిన అధికారులు రాకపోవడంతో వారందరికీ గైర్హాజరు వేసి నివేదికను జిల్లా పరిషత్ పరిషత్ సిఈఓ కు, కలెక్టర్ కు పంపడం జరుగుతుందని ఎంపీడీవో గోపి బాబు తెలిపారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ లో పదవతరగతి ఫలితాల్లో 26 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, మ్యాథ్స్ అధ్యాపకుడు లేక పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని సభా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో గ్రామల వర్గికరణ వర్గీకరణ సమయంలో ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు తొలగించారని, తిరిగి పలుమార్లు కూలీలు జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రావడం లేదని పలువురు ఎంపిటిసి లో తెలిపారు ఈ సమస్యను పరిష్కరించి జాబ్ కార్డు అందజేసే విధంగా చూడాలని వచ్చే వర్షాకాలంలో ఉపాధి హామీలో కాలువల పరమతులు ఫీల్డ్ ఛానల్ తూముల వద్ద కుళ్ళు వచ్చే పనులు చేయించే విధంగా చూడాలని ఏపీవో కు ఎంపీటీసీ సాయిలు విన్నవించారు.మండల కేంద్రంలో తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరు కావడంతో రెండు గంటల లోపే సమావేశం ను ముగింప జేశారు.ఈ సమావేశం లో ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love