ఈనెల 6 వరకు ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్ష ఫీజు గడవు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5YIPGP APE/PCH) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ వరకు గడువు ఉందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.100 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 9వ వరకు అవకాశం ఉందని సీఈవో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అరుణా సూచించారు.5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు కు చెందిన (5YIPGP)8వ మరియు 10వ సెమిస్టర్ రెగ్యులర్ ఎంఏ ( అప్లిఎటెడ్ ఎకనామిక్స్) అన్ని సబ్జెక్ట్ పరీక్షల కు 500 రూపాయలు చెల్లించాలని,ఎం ఎస్సి M. Sc ( ఫార్మచుటికల్ కెమిస్ట్రీ) రెగ్యులర్ అన్ని సబ్జెక్టులకు 600 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. 8వ,10వ సెమిస్టర్ బ్యాక్ లగ్ కి (2016 బ్యాచ్ ఒన్ వర్డ్స్),ఎం ఏ ( అప్లైడ్ ఎకనామిక్స్ ) ఒక సబ్జెక్టుకి 150 రూపాయలు, రెండు సబ్జెక్ట్ లకు 300 రూపాయలు, రెండు సబ్జెక్టుల కంటే ఎక్కువగా ఉంటే 500రూపాయలు చెల్లించాలని అరుణా సూచించారు. ఎంఎస్సి ( ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ) కి చెందిన ఒక సబ్జెక్టుకి 175రూపాయలు, రెండు సబ్జెక్టులకు 350 రూపాయలు, రెండు కంటే ఎక్కువ సబ్జెక్టు లు ఉంటే 600 రూపాయలు చెల్లించాలని పరిక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ని సంప్రదించాలని కోరారు.

Spread the love