లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
వెనుకబడిన కులాల వృత్తులు, చేతి వృత్తి కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన చేతివృత్తుల వారికీ 18 నుండి 55 ఏళ్ళ లోపు వారికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిచ్ పల్లి,ఇందల్ వాయి ఎంపిడిఒ లు గోపి బాబు, రాములు నాయక్ లు వెర్వెరు ప్రకటనలో గురువారం తెలిపారు. 06 నుండి ఈ నేలా 20 లోపు ఆన్లైన్లో, మీ సేవ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఈక్రింది అర్హతలు కలిగి ఉండాలని సూచించారు. అర్హత కలిగిన వారు నూతనంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కు సంబంధించిన వృత్తుల అభ్యున్నతికి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అందజేయడం జరుగుతుందని వారు వివరించారు. అభ్యర్థుల వ్యక్తిగత వయస్సు 18 నుండి 55 ఏళ్ళ వరకు జూన్ 2 2023 వరకు నిండి ఉండాలని పేర్కొన్నారు.వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2.00 లక్షలు మించకుండా ఉండాలని,దరఖాస్తు తేది నుండి గత 5 సంవత్సరముల లోపు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయిన ఆర్థిక లబ్దిపొందిన వారు, 2017-18లో రూ. 50, వేల రూపాయల లబ్ది పొందిన వారు అర్హులు కాదన్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తును వారి కులధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఆహార భద్రత కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్ బుక్ జతపరచి సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.వెనుక బడిన కులాలు నాయీ బ్రాహ్మణులు, రజక, సాగర, ఉప్పర, కుమ్మరి / శాలివాహన, ఔసుల, కంసాలి , కమ్మరి , కంచరి, వడ్లా లేదా వాద్రా లేదా వడ్రంగి మరియు శిల్పి, కృష్ణ బలిజ పూసల, మేదర ,వడ్డెర, అరెకటిక, మేరా,ఎంబిసి (అత్యంత వెనుకబడిన తరగతి) వారే అర్హులని తెలిపారు.

 

Spread the love