ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపాలి

– బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించండి
– వద్దిరాజు రవిచంద్ర, నామ, సండ్ర, పిలుపు
నవతెలంగాణ-కల్లూరు
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలను కోరారు. బుధవారం స్థానిక లక్కినేని రఘు గృహ వద్ద ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాటలన్నీ మోసాలేనని, వంద రోజులు దాటిన అమలు కానీ 6 గ్యారంటీ మాటేమిటంటే వారు ప్రశ్నించారు. బస్సు, గ్యాస్‌, విద్యుత్తు ఇస్తే ఇచ్చిన హామీలన్నీ పూర్తయినట్లేనా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయని వాటి పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. రైతుబంధు వేస్తున్నట్లు ప్రకటించి కుంటి సాకుతో ఎలక్షన్‌ కమిషనర్‌ వద్దన్నారని ఆపటం ఇది రేవంత్‌ పని కాదా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను అమలు కాని హామీల గురించి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నామ నాగేశ్వరావు గెలిపించాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరాలని కార్యకర్తలు కోరారు. పక్క లోకల్‌ అని నిత్యం ప్రజల మధ్యనే ఉంటాడని ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తారని అలాంటి ప్రశ్నించే గొంతుకు పార్లమెంటుకు పంపాలంటే సమిష్టిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఖమ్మంలో నామ ని గెలిపించి కేసీఆర్‌ కి కానుక ఇద్దామని అందుకు మీ అందరి సహకారం అవసరమని ఇక మిగిలింది నాలుగు రోజులైనా ఈ నాలుగు రోజులు సమిష్టిగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్ట అజరు కుమార్‌, లక్కీనేని రఘు, పెద్ద బోయిన మల్లేశ్వరరావు, స్థానిక నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలంటూ అమలుగాని హామీలతో మోసం
కారేపల్లి: ఆరుగ్యారంటీలు అంటూ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లు విమర్శించారు. మంగళవారం రాత్రి కారేపల్లిలో జరగాల్సి రోడ్‌ షో వర్షంతో రద్దు అయింది. రోడ్‌ షోకు వచ్చిన టీడీపీ శ్రేణులు చెల్లచెదురైనారు. అయినా నామా రోడ్‌ షో కోసం కార్యకర్తలు తడుస్తూనే కారేపల్లిలో వేచి ఉన్నారు. కారేపల్లిలోని అంబేద్కర్‌ సెంటర్‌ లో కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసిఆర్‌ కుందన్నారు. ధాన్యాగారంగా బాసిల్లిన తెలంగాణను కరువురాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. రైతుల ధాన్యానికి రూ.500 బోనస్‌ బోగస్‌గా మార్చారన్నారు. కళ్యాణలక్ష్మిలో తులం బంగారం, యువతులకు స్కూటీలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వీ 420 హామీలు తప్ప ప్రజలకు ఇచ్చేవి కావన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని దానిలో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. స్ధానికుడిని గెలిపించుకోని అభివృద్ధికి బాటలు వేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు ఆర్‌జెసి.కష్ణ, వైరా నియోజకవర్గ ఇంచార్జ్‌ బానోతు మదన్‌లాల్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ మాలోత్‌ శకుంతలకిశోర్‌, జడ్పీటీసీి వాంకుడోత్‌ జగన్‌, మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేంధర్‌, నాయకులు హన్మకొండ రమేష్‌, గౌసుద్దీన్‌, డొంకెన రవీందర్‌, అడపా పుల్లారావు, జూపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love