నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి

– పోలింగ్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
– ఎస్పీ రోహిత్‌ రాజు
నవతెలంగాణ-ఇల్లందు
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని, పోలింగ్‌ పూర్తయ్యే వరకు చెక్పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశించారు. ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నందు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన అంతర్‌ జిల్లా సరిహద్దు చెక్పోస్టులను బుధవారం తనిఖీ చేశారు. బొమ్మనపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద,ఇల్లందు లలితాపురం చెక్‌ పోస్ట్‌లను తనిఖీ చేసి సింగరేణి ఎయిడెడ్‌ హై స్కూల్‌ నందు స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. పోలింగ్‌ పూర్తయ్య వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు భాద్యతగా వ్యవహారించాలన్నారు. అనంతరం ఇల్లందు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లు, రూట్‌ మ్యాప్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, సీఐ కరుణాకర్‌, ఎస్బి ఇన్స్‌పెక్టర్‌ నాగరాజు, ఎస్సై సందీప్‌, సిబ్బంది పాల్గోన్నారు.

Spread the love