దేవుడే న్యాయం చేయాలి.. అప్సర తండ్రి శ్రీకర్

నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో హత్యకు గురైన అప్సర కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. అప్సరకు ఇదివరకే వివాహం జరిగిందని, ఆమె వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా అప్సర తండ్రి శ్రీకర్ స్పందించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు తన కూతురుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దేవుడే తమకు న్యాయం చేయాలని వాపోయారు. సాయికృష్ణ తమ కూతురును నమ్మించి గొంతు కోశాడని ఆరోపించారు. ఆల‌యానికి వెళ్లిన త‌మ కుమార్తెను సాయికృష్ణ ట్రాప్ చేశార‌ని శ్రీకర్ ఆరోపించారు. భార్యతో విభేదాలు ఉన్నాయని, తొందర్లోనే ఆమెకు విడాకులు ఇచ్చి, ఆరు నెలల తర్వాత అప్సరను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని చెప్పారు. ప్రేమ పేరుతో వంచించిన సాయికృష్ణను తన కూతురు పెళ్లి చేసుకొమ్మంటూ పట్టుబట్టడంతోనే ఈ దారుణానికి తెగబడ్డాడని ఆరోపించారు.

Spread the love