– కార్మికుల
నవతెలంగాణ -బోధన్ టౌన్
నవతెలంగాణ -బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట రీలే నిరాహార దీక్షను శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బకాయిలో ఉన్న వారి వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదీనంలో నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులకు కాంగ్రెస్,శివసేన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఈ దీక్షలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.