సుప్రీంకోర్టు తీర్పు ప్రజలకు మరింత విశ్వాసం పెంచింది..

– రాహుల్ గాంధీ ఊరటపై బేగంపేటలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
నవతెలంగాణ-బెజ్జంకి 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న ఆరాచక పాలనకు నిదర్శనం ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడమేనని.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లబించడం దేశంలోని న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం పెంచిందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రీసేర్చ్ విభాగం చైర్మన్,జిల్లాధికార ప్రతినిధి డాక్టర్ పొతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీకి లబించిన ఊరటపై శనివారం మండల పరిధిలోని బేగంపేట గ్రామ ప్రధాన కూడలి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ జైలు శిక్ష పై సుప్రీంకోర్టులో ఊరట లబించడం విద్వేషంపై ప్రేమ సాధించిన విజయమని రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేశారు.మండలాద్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,మండల అధికార ప్రతినిధి జనగాం శంకర్, నాయకులు బుర్ర తిరుపతి గౌడ్,శీలం నర్సయ్య,కొరివి లక్ష్మణ్,రాజు,మహేందర్,కొమ్ము కోటయ్య,బుర్ర అంజయ్య,పిట్టల అరుణ్,కొరివి కనకయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
 బీసీ సహయం ఎన్నికల్లోపు అందించాలి 
అంబేడ్కర్ వినతిపత్రమందజేసిన కాంగ్రెస్ శ్రేణులు
పాత పథకాలను పాతరేస్తూ కొత్త పథకాల పేరుతో ఆశచూపుతూ ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి ఆరోపించారు.ఇటీవల బీసీలకు రూ.లక్ష సహయమందజేస్తామని దరఖాస్తులు స్వీకరించి నిర్లక్యంగా వ్యవహరిస్తోందని..దరఖాస్తుదారులందరికి ప్రభుత్వం సహయమందజేయాలని శనివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహనికి కాంగ్రెస్ శ్రేణులు వినతిపత్రమందజేశారు.సమానత్వం,సమన్యాయం పాటించకుండా కులాల,మతాల పేరుతో సహయమందజేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం విభజించి పరిపాలన సాగిస్తుందని.. ఎస్సీ,బీసీ,మైనార్టీ వర్గాలకు అందజేస్తామని ప్రకటించిన పథకాలు,సహయాలను ఎన్నికల్లోపు అందజేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని రత్నాకర్ రెడ్డి హెచ్చరించారు. నాయకులు రొడ్డ మల్లేశం,కొంకటి రాములు,గూడెల్లి శ్రీకాంత్,జనాగం శంకర్, దోనే వెంకటేశ్వర రావు,మహేందర్, జీల లింగం,రంగోని రాజు,ఉపేందర్,నరేందర్ రెడ్డి,బిగుళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love