– పాఠశాలలో మౌలిక సామాగ్రికి వినియోగం
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులు పదిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వం రూ.25 వేలు పారితోషికం అందజేసినట్టు సర్పంచ్ బోయినిపల్లి నర్సింగ రావు తెలిపారు. మంగళవారం పాఠశాలలో మౌలిక వసతులకు పారితోషికం నగదును వినియోగించి సామాగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు.అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.ఈ ప్రభుత్వోన్నత పాఠశాల బోధన సిబ్బంది, అంగన్వాడీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.