16న ఖేలో ఇండియా సైక్లింగ్ ఎంపికలు

– జిల్లా యువజన సంక్షేమ, క్రీడాల శాఖ అధికారి నాగేందర్
నవతెలంగాణ – సిద్దిపేట
ఖేలో ఇండియా సిద్దిపేట జిల్లా సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 16న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం ఏడు గంటలకు సైక్లింగ్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ మరియు క్రీడా శాఖ అధికారి నాగేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 12 నుండి 16 సంవత్సరాల మధ్య ఉన్న బాల ,బాలికలకు సైక్లింగ్ లో 16న ఉదయం ఏడు గంటలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైక్లింగ్ లో శిక్షణ పొందాలని ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికల కోసం వచ్చేవారు ఆధార్ కార్డు, పాఠశాల బోనఫైడ్, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని రావాలని సూచించారు. ఎంపికైన వారికి సైక్లింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సైక్లింగ్ శిక్షకులు సంజీవ్, 9640760193 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైకిల్ అసోసియేషన్ అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జంగపల్లి వెంకన్న పాల్గొన్నారు.

Spread the love