యువత చేగువేరా స్ఫూర్తితో పోరాడుదాం..

– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్
నవ తెలంగాణ – సిద్దిపేట
చేగువేరా స్ఫూర్తితో విద్యా, ఉపాధి అవకాశాలపై పోరాటాలకు నేటితరం యువత సన్నద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో చేగువేరా 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగువేరా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి, పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత చేగువేరాదని అన్నారు. వైద్య వృత్తిని పక్కనపెట్టి విద్యార్థి , యువత , కార్మిక, కర్షక ప్రజలను ఆదుకోవడానికి, సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరూగెత్తించిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహించారని, మంత్రి పదవిలో ఉన్న అని చూడకుండా, కార్మికులతో కలిసి పని చేసిన గొప్ప నాయకుడు అని అన్నారు. నేటితరం వైద్యులు చేగువేరా స్ఫూర్తితో ఉచిత వైద్యం అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేగువేరా స్ఫూర్తితో నేటితరం యువత ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కెసిఆర్ యువతను మోసం చేశాడని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు యువత సన్నద్ధం కావాలని పిలిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్ కుమార్ , నాయకులు నవీన్, భాను, రాజు, శివ, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love