అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేరడానికి దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ బడిన రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్/ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో 2023-24 విద్యా సంవత్సరంకు అడ్మిషన్లు ప్రారంభ మైనవని, విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ యాదవ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బాలురకు మాత్రమే అడ్మిషన్ల సౌకర్యం కలదని, ముఖ్యంగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో బడుగు, బలహీన, పేదకుటుంబాల విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు, ఉచిత హాస్టల్ వసతి, నెలవారి స్టైఫండ్, పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పౌష్టికాహరం, మినరల్ వాటర్, బెడ్షీట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు. రెండు ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, పుట్టిన తేది వివరాలు అవసరమని తెలిపారు. పూర్తి వివరాలకు 9959492475, 9949905697 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Spread the love