కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షునిగా దూడం శ్రీనివాస్

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట పట్టణ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా దూడం శ్రీనివాస్ (వాసు), ప్రధాన కార్యదర్శిగా ముత్యాల సంతోష్ రెడ్డి ఎన్నికయ్యారు.  ఉపాధ్యక్షులుగా చేర్యాల శ్రీకాంత్, జక్కుల కృష్ణ, గ్యాదరి భూమలింగం, సంయుక్త కార్యదర్షులుగా గొట్టిపర్తి యాదగిరి గౌడ్, మల్లికార్జున్ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా అంజి యాదవ్, భాస్కర్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా వేణుగోపాల్, విక్రమ్ రెడ్డి, అయిత బాల రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దూడం వాసు మాట్లాడుతూ ఆపరేటర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. వారి సంక్షేమానికి అసోసియేషన్ పరంగా శ్రమిస్తామన్నారు.

Spread the love