రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

నవతెలంగాణ – సిద్దిపేట
అండర్ 18 విభాగంలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు జిల్లా నుండి క్రీడాకారుల, క్రీడాకారునిల ఎంపిక చేసినట్లు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల మల్లికార్జున్, కార్యదర్శి గుండి ప్రవీణ్ లు తెలిపారు. ఆదివారం సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో సిద్దిపేట జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంపికల కోసం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా క్రీడా శాఖ అధికారి నాగేందర్ , స్థానిక మంత్రి హరీశ్ రావు సహకారంతో అండర్ 18 బాలబాలికల స్విమ్మింగ్ ఎంపికలు చేయడం జరిగిందని, ఇందులో సుమారు 110 మంది బాల, బాలికలు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.  ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18న సికింద్రాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు….
ఫ్రీ స్టైల్ 50 మీటర్స్ యహశ్విన్, రిషిత్ రాజ్, అనిర్వేశ్,
ఫ్రీ స్టైల్ 100 మీటర్స్ పి. యహశ్విన్, పి అనిర్వేశ్, శ్రీ ప్రాద్, బటర్ఫ్లై 50 మీటర్స లో
పి అనిర్వేష్, తనై, జి సుప్రీత్, బ్రెస్ట్ స్ట్రోక్ 50 మీటర్ లో
సంతోష్, అనిర్వేశ్, నిహాల్ నారాయణ, బ్యాక్ స్ట్రోక్ 50 మీటర్స లో రిషిత్ రాజ్, అనిర్వేశ్, సుహాన్,
బాలికలు ఫ్రీ స్టైల్ 50 మీటర్స్
శ్రీ కల, శృతిక, శ్రీవల్లి రెడ్డి, ఫ్రీ స్టైల్ 100 మీటర్ లో
కృత్తికా రెడ్డి, శృతిక, బ్రెస్ట్ స్ట్రోక్ 50 మీటర్స లో
శ్రీకళ, శ్రీవల్లి రెడ్డి, యు శ్రీవల్లి,
బ్యాక్ స్ట్రోక్ 50 మీటర్స్ లో శ్రీకళ, శ్రీవల్లి రెడ్డి, శ్రీవల్లి
తదితరులు ఎంపికయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోచులు అక్బర్ నవాబ్, కనకయ్య, సంజీవ్, ప్రదీప్, రవి, అరుణ్, తిరుపతి , నగేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love