మార్గం మధ్యలో అంబులెన్స్‌లో ప్రసవం..

నవతెలంగాణ – అయిజ
అయిజ మండల పరిధిలోని పులికల్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు. సంధ్య ( లక్ష్మి ) భర్త పేరు రవి అంబులెన్స్ లో మండల ప్రభుత్వ దవఖానకు తరలిస్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది ఇశ్రాయేలు ప్రసవం చేశారు.లక్ష్మి పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది.తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బంది ఇశ్రాయేలు మరియు డ్రైవర్ శ్రీధర్కు లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి విషయం పట్ల సోషల్ మీడియాలో నేటిజెన్లు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love