ప్రమాదాలకు అడ్డగా మారిన పులికల్ రోడ్

– ఇంకా ఎంత మంది చస్తే పులికల్ రోడ్డును బాగు చేస్తారు
– పులికల్ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన సంపత్ కుమార్
నవతెలంగాణ – అయిజ
అయిజ మండల కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ ను కలిపే నాగలదిన్నె రోడ్డు అంతరాష్ట్ర రోడ్డుగా 2018 సంపత్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శాంక్షన్ అయితే ఇప్పటివరకు పూర్తి చేయని టిఆర్ఎస్ అధికార ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ శనివారం రోజున పులికల్ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ రోడ్డు వెంట అనేక గ్రామాలు ఉండడంతో నిత్యం ఐజ మండల కేంద్రానికి రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ కు కంకర మాత్రమే వేసి వదిలిపెట్టడంతో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు బైకులతో, ఆటోలతో, కార్లతో అదుపు తప్పి కింద పడిపోయి కాళ్లు చేతులు విరగడం, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనునిత్యం జరుగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతూ ఈరోజు సంపత్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులతో కలసి దీక్ష చేపట్టారు. ఇప్పటికీ దాదాపు వందల మంది కాళ్లు, చేతులు విరిగి, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన… స్థానిక ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు చూసి చూడనట్టుగా వ్యవహరించడం దుర్మార్గమని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ రోడ్ మార్గాన ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి ముట్టే వరకు నమ్మకం లేని పరిస్థితి నెలకొని ఉంది. అనేక పర్యాయాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన ఇప్పటికీ స్పందించకపోవడంతో ఇక్కడి గ్రామాల ప్రజలు ఎంతో ఆవేదనతో ఉన్నారని సంపత్ కుమార్ వ్యక్తపరిచారు. ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేయాలని సంపత్ కుమార్ ఈ ధర్నా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పోలీసులు సంపత్ కుమార్ ను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు ఐజా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు.

Spread the love