నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని కోమన్ పల్లి గ్రామానికి చెందిన తన భర్త మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ధనలక్ష్మి తెలిపారు వివరాలు ఇలా ఉన్నవి. ఈ గురువారం 8వ తేదీ నిమ్మ నవీన్ 36 సంవత్సరాలు మిషిన్ భగీరథ నందు పైపు జాయింటరుగా విధులు నిర్వహిస్తున్నారని, ఉదయం టీఎస్ 16 ఈ క్యు 14 34 నంబరు గల హోండా షైన్ బైకుపై మిషన్ భగీరథ పైప్ లైన్ పని నిమిత్తం బయలు దేరినాడని, కొద్దిసేపటికి 44 జాతీయ రహదారి పెర్కిట్ బైపాస్ యూటర్న్ దగ్గర టీఎస్ 0 8 ఎఫ్ జెడ్ 13 12 నంబర్ గల చలో నా కారును నడుపుతూ తన భర్త తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే చనిపోయినాడు అని, మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.