తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు

నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మండలంలోని గుర్తురు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఉమ్మ గాని వెంకన్న వృత్తిలో భాగంగా ప్రతిరోజు మాదిరిగానే తాటిచెట్టు ఎక్కుతుండగా తాటి చెట్టు పై నుండి కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోగా తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు గుర్తించి తొర్రూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
Spread the love