శిక్షణ తరగతులకు తప్పక హాజరు కావాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రెండో విడత శిక్షణ తరగతులకు తప్పక హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 3 , 4 తేదీలలో నిర్వహించే శిక్షణ తరగతులకు పిఓలు ఏపీవోలు తప్పక హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై సెక్షన్ 28 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు తమ దిగువ స్థాయి సిబ్బందికి  శిక్షణా తరగతుల ఉత్తర్వులను అందజేసి శిక్షణ తరగతులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సెక్టోరల్ అధికారులు లాండ్ ఆర్డర్ ను పరిశీలించాలని కలెక్టర్ ఎన్నికలు ఎన్నికల విధుల్లో హాజరై సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ట్రైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన  ఫెసిలిటేషన్ సెంటర్స్ లో పోస్టల్ బ్యాలెట్లు ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సొంత ప్రాంతాలలో ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగం కొరకు క్యాజువల్ లీవ్ వారి పని చేసే శాఖ అధికారుల ద్వారా పర్మిషన్ లెటర్ పెట్టాలన్నారు. తాసిల్దార్లు ఎంఈఓ లు సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశుభ్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ధ్రువీకరణ పత్రం సంతకం చేసి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు వారికి కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ పేరుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నలుగురు విలేజ్ పోలీస్ వాలంటీర్స్  ఉంటారని పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాలుగు నియోజకవర్గాల ఎన్నికల అధికారులు పోలింగ్ కొరకు కావలసిన బస్సుల యొక్క వివరాలను ఎలక్షన్  సూపర్డేంట్ పంపించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు మూడు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని ,అధికారులు నిరంతరంగా పరివేక్షిస్తూ, ధాన్యం కొనుగోలను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. నిన్న సూర్యపేట మార్కెట్లో జరిగిన సంఘటనలో చాకచక్యంగా వ్యవహరించి గన్ని బ్యాగులను హమాలీలకు అందజేసి దగ్గర ఉండి 30 వేల బస్తాలు ధాన్యం కాంటాలు అయ్యే విధంగా చర్యలు తీసుకున్న డిఎం మార్కెటింగ్ కే నాగేశ్వర శర్మను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు తాసిల్దార్లు ఎంపీడీవోలు అధికారులు పీవోలు ఏపీవోలు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love