– మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఫ్లో మీటర్ పరిశీలన.వార్డుల్లో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టండి.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలకు శుద్ధి త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట పట్టణానికి 24 ఎం.ఎల్.టి త్రాగు నీరు అందిస్తున్నామని అలాగే మున్సిపాలిటీలో విలీనమైన జి.పి.లతో పాటు అన్ని వార్డులలో ఎక్కడకూడా నీటి ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. శాంతినగర్ లోని మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అలాగే ఫ్లో మీటర్ ను పరిశీలించారు. పట్టణానికి ఇమాంపేట, చంద్రుపట్ల నుండి వస్తున్న నీటి లభ్యత తదితర విషయాలను మున్సిపల్ సిబ్బందితో చర్చించారు. వేసవి దృష్ట్యా ఈ మూడు నెలలు నీటిని పొదుపుగా వాడుకొనేల అవగాహన కల్పించాలని అలాగే అన్ని నీటి ట్యాంక్ క్లోరినేషన్ చేయాలని అలాగే నీటిని టేస్ట్ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఈ. ఈ కృష్ణ ప్రసాద్, ఎం.బి. ఈ.ఈ అరుణాకర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.