శ్రీ క్రోధి’లో అన్నిరంగాల్లో శుభాలు కలగాలి

– తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
– గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి, శాసన సభ్యులు
నవతెలంగాణ – సూర్యాపేట
శ్రీ క్రోధనామ సంవత్సరంలో అందరికీ అన్నీ శుభాలు జరగాలని మాజీ  మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ క్రోధ నామసంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆయన ఆశించారు.తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులకు అంతా మంచి జరగాలని కోరారు.అలాగే సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, పల్లెలు పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Spread the love