నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించేలా శ్రీ క్రోది నామ సంవత్సరం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకాంక్షించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పండితులు వేద పఠనం, ఆశీర్వదానం, పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురావలని, పంటలు బాగా పండాలని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారంతా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. అనంతరం పండితులు క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం వినిపించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.