లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

– రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలి.
– సెక్టార్ అధికారుల పాత్ర కీలకం.
– నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ హరిచందన.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  నియమించిన అన్ని బృందాలు ఎన్నికల శిక్షణ అనంతరం ఎన్నికల నిర్వహణకు సంసిద్దంగా ఉండాలని నల్గొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఏ.ఆర్.ఓ లు, సెక్టార్ అధికారులు, నియమించిన బృందాలతో  ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..13 నల్గొండ పార్లమెంట్ నియోజక పరిధిలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్స్  ఉన్నాయని అలాగే 14 భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిధి తుంగతుర్తి 6 మండలాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల నిర్వహణలో నియమించిన  సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమంలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 729 ప్రాంతాల్లో 1201 పోలింగ్ కేంద్రాల  ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. గుర్తించిన 163 ప్రాంతాల్లో 238 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. అర్హులైన అందరికి ఎపిక్ కార్డులు జారీ చేయాలని సూచించారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టాలని అన్నారు. Eci సూచించిన విదంగా  వృద్ధులు, వికలాంగుకు హోమ్ ఓటింగ్ చేపట్టాలని అన్నారు. మే 18 న నోటిఫికేషన్ విడుదల అవుతున్నందున నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలుపుతూ జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉంటే తెలపాలని అన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో 1201 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాని, జిల్లాలో 998333 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా చెక్ పోస్టులులో తనిఖీలు చేపట్టే ఎస్ ఎస్ టి బృందాలకు త్రాగునీరు, కూలర్, మరుగుదొడ్లు సదుపాయం  కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో అంగవైకల్యం ఉన్న ఓటర్లు  17212 మంది అలాగే 85 సంవత్సరాలు నిండిన 6424 మంది ఓటర్లు ఉన్నారని ఏర్పాటు చేసిన టీమ్స్ ద్వారా హోమ్ ఓటింగ్  చేపడుతామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో  48 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎన్నికల నిర్వహణకు పి.ఓ, ఏ.పి.ఓలు, అలాగే ఈవీఎం ల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామని  పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచామని అలాగే అన్ని కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 112 రూట్స్ ఏర్పాటు చేసి 123 మంది సెక్టార్ అధికారులను నియమించమని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 6296 మంది సిబ్బందిని నియమించమని తెలిపారు.  జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉందని  అన్ని చెక్పోస్టుల్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులు గ్రీవెన్స్  కమిటీ ద్వారా పరిశీలన తదుపరి బాధితులకు అందచేస్తున్నామని  ఈ సందర్బంగా  కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంటగో 48 అమ్మఆదర్శ పాఠశాలలో పనులు వేగవంతంగా జతుగుతున్నాయని ఈ పాఠశాలలో  పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అర్హులైన వారికి 98.55 శాతం  ఎపిక్ కార్డులు జరిచేసామని అన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఎస్పీ, నల్గొండ ఎస్పీ మాట్లాడుతూ..రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన అన్ని చెక్పోస్టుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడం జరుగుతుందని  అలాగే గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా పెంచామని అలాగే ఇప్పటికే  రెండు పారా మిలటరీ బృందాలు జిల్లాలకు వచ్చాయని పోలింగ్ రోజున, రూట్ వారీగా ఈవీఎం ల తరలింపులో  గట్టి బ్లాందోబస్తు నిర్వహిస్తామని ఎఫ్ ఎస్ టి, ఏం సి సి బృందాలతో కలసి పనిచేస్తున్నమని తెలిపారు.ఎక్కడ కూడా ఎలాంటి వైలేషన్ కాకుండా చూడాలని అన్ని చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని పోలీస్ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహిస్తుందన్ని  పేర్కొన్నారు.సమావేశానికి ముందు వ్యవసాయ మార్కెట్  గోదాంలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూమ్స్ ను పరిశీలించి ఏర్పాట్ల పై సంతోషం వ్యక్తం చేశారు.మీడియా సెంటర్, సోషల్ మీడియా ట్రాకింగ్  సెంటర్, ఎలక్షన్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు.ఈ సమావేశంలో సూర్యాపేట అదనవు కలెక్టర్లు ప్రియాంక, బి.ఎస్. లత,  నల్గొండ ఆదనవు కలెక్టర్  శ్రీనివాస్, ట్రైనింగ్ ఐపీఎస్  రాజేష్ మీనా, ఏ.ఎస్.పి నాగేశ్వర రావు,  సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, డి.సి.ఓ పద్మ, ఆర్.డి.ఓ లు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీవోలు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love