అమలు కానీ ఫ్రీ ఇసుక: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఫ్రీగా ఇంటి నిర్మాణాలకు ఇసుక తోలుకోవచ్చు అనే ఉద్దేశంతో గతనెల మార్చి 23 ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు సహకరించడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి జీవో జారీ చేసినప్పటికీ గైడ్ లైన్స్ రాలేదని ఇంటి నిర్మాణదారులను ఆఫీసులో చుట్టూ తిప్పించుకుంటున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫ్రీ ఇసుక సంబంధించిన సర్కార్ ఆదేశాలిచ్చిన స్థానిక అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇల్లు కట్టుకునే వ్యక్తి ఇసుక కావాలన్నా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాల్సిందే లేదంటే ట్రాక్టర్ మరియు డ్రైవర్ యజమానులపై కేసులు నమోదు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలు తుంగలో తొక్కి ఎప్పటిలాగే ఇసుక దందా జోరుగా సాగుతుంది.
పర్మిషన్ కోసం ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న నిర్మాణదారులు..
జిల్లా మరియు తొర్రూర్ డివిజన్ లో ఆకేరు పాలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ వాగుల్లో లోకల్ గా ఇసుక నిల్వలు ఉన్నాయి అక్కడ నుండి ఇసుక తోలుకుంటామని ఇంటి నిర్మాణలు చేసేవారు పర్మిషన్ కోసం తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
బ్లాక్ లో ఇసుక దందా..
బహిరంగంగా ఇసుక ఒక ట్రాక్టర్ ట్రిప్పు సన్న ఇసుక రూ.6000 చొప్పున వ్యాపారస్తులు బహిరంగంగా అమ్ముతున్నారు దీంతో సామాన్యుడు ఇసుక కె లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, ఇంటి నిర్మాణాలు ఆపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఫ్రీ ఇసుకకు ఆటంకాలు సృష్టించ కుండా లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు ఇసుకను సరఫరా చేసే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంటి నిర్మాణాలకు ఫ్రీగా ఇసుక సరఫరా చేయాలి: ఎండి యాకూబ్ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి..
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఇసుక ఫ్రీగా సరఫరా చేయాలి గత మార్చి నెలలో ఇచ్చిన జీవోను అధికారులు అమలు చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారు ఇంటి నిర్మాణాలు చేసే వ్యక్తులు ఇసుక దొరకక చాలా ఇబ్బందులు పడుతూ కార్మికులు పనులు లేక పట్టణాలకు వలస వెళుతున్నారు ఇంటి నిర్మాణాలు చేసేవారు గోదావరి ఇసుక ఒక ట్రాక్టర్ ట్రిప్ కు ఆరువేల రూపాయలు చొప్పున చెల్లించి ఇంటి నిర్మాణాలు చేయాలంటే భయపడుతున్నారు. లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణాలు చేసి అప్పుల పాలవుతున్నారు  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు అయ్యేవిధంగా చూడాలి.
Spread the love