వెల్లువిరిసిన వసంత ఋతువు

– చిగురించిన పచ్చని చిగుళ్లు.
– పల్లెల్లో జరగనున్న తెలుగు సంవత్సరాది సంబరాలు.
– రేపు ఉగాది పండుగ 
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రమైన ఉగాది పర్వదిన  వేడుకలను రేపు మంగళవారం శ్రీ కొదినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు సంవత్సరాది సంబరాలు ఘనంగా నిర్వహించుకొనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు.పల్లెల లోగిళ్ళలో పచ్చదనం,రైతన్నలు ఏరువాక ప్రారంభానికి సూచికగా,ఆరు షడ్రుచులతో పచ్చడి,పిండి వంటకాలు తదితరవి ఉగాది పర్వదినాన్ని రైతులు ఘనంగా జరుపుకుంటారు.అన్ని వర్గాల ప్రజలు ఉగాది ఉత్షాహంలో ఉరకలేసి పల్లె,పట్నం తేడా లేకుండా వసంత ఋతువు ప్రారంభోత్సవంతో ఉగాది పచ్చళ్ళు రుచి కమ్మదనంతో నోరూరించనుంది.
రంగురంగుల ముగ్గులతో వాకిళ్ళు అలంకరణ..
వేగువజామునే మహిళలు నిద్రలేచి తమ ఇంటి ఎదుట వాకిళ్ళు శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో అలంకరించనున్నారు.ప్రతి ఇంట్లో పచ్చని మామిడి తోరణాలు, రంగురంగుల పులదండలు వెల్లివిరుస్తాయి. పిల్లలు,పెద్దలు తెలుగు సాంప్రదాయం వెల్లివిరిచేలా తెలంగాణ సాంస్కృతి చాటేలా దుస్తులు ధరించి సందడి చేయనున్నారు.
షడ్రుల పచ్చడి సర్వ రోగ నివారిణి..
ఉదయం ప్రతి ఇంట్లో షడ్రుచుల ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని అరగించనున్నారు.వేకువజామున పిల్లలు, పెద్దలు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానాలు ఆచరించి కంకణాలు ధరించి కొత్త పాత్రలో కొంగొత్త మామిడి కాయలు,కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేప పూవు,ఉప్పు,కారంతో  కలిసి నోరూరించే ఉగాది పచ్చడి తాగనున్నారు.ఉగాది పచ్చడి సర్వ రోగాలకు నిరోధించడానికి పని చేస్తోందని ప్రజల ప్రగాఢ నమ్మకం.
Spread the love