కొండ బాపూజీ విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు 

నవతెలంగాణ –  మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరై కొండా బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండా బాపూజీ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ ప్రాoగణంలో రూ.5లక్షలతో నిర్మాణం చేపట్టిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని వాడకంలోకి తేవాలని, అదనంగా నూతన అతిథి గృహాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేస్ మిశ్రా, ఎంపిపి సమ్మయ్య,ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Spread the love