భారీ అగ్ని ప్రమాదం.. తీవ్ర ఆస్తి నష్టం..

– ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో భారీ నష్టం
– మామిడి జామ చెట్లు దహనం
– విద్యుత్తు వైర్ బండిల్స్ మోటర్లు దహనం
నవతెలంగాణ – శాయంపేట
గుర్తుతెలియని వ్యక్తులు చేలుకల్లో నిప్పు వేయడంతో మంట రాజుకుంటూ వెళ్లి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, మామిడి, జామ చెట్లతో పాటు విద్యుత్ వైర్బండిల్లు, మోటర్లు, పైపులు కాలిపోయాయని బాధిత రైతులు తెలిపారు. రైతు రేణిగుంట్ల ఐలయ్య కథనం ప్రకారం… పరకాల హనుమకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట గుట్టల వద్ద పడమటి దిశలో సర్వేనెంబర్ 103/54, 103/55 లో ఏడేళ్ల క్రితం మామిడి, జామ తోటలు పెట్టినట్లు తెలిపారు. మామిడికాయలు చేతికి అందివస్తుందనుకున్న తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సమీప పంట చేలల్లో నిప్పు వేయడంతో మంట రాజుకుంటూ వచ్చి 20 మామిడి చెట్లు, 30 జామ చెట్లు, నాలుగు వైరు బండిల్స్, ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఐలయ్య తెలిపారు. కాగా ఇవే మంటలు రాజుకుంటూ వెళ్లడంతో రేణిగుంట్ల భరత్ కు చెందిన 30 జామ చెట్లు, కొమ్ముల రామస్వామికి చెందిన కరెంటు మోటారు, కరెంటు వైర్, స్టార్టర్ బాక్స్, 30 పైపులు, రేణిగుంట్ల మొగిలి కి చెందిన రెండు మోటర్లు, 15 పైపులు, కరెంటు వైర్, స్టార్టర్ బాక్స్, కొమ్ముల పరమేశ్వర్ కు చెందిన ఆరు పైపులు, కరెంటు వైర్ అగ్నికి ఆహుతి అయినట్లు బాధితులు తెలిపారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు.

Spread the love